Updated 2 February 2022 Wednesday 07:10 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లాలో జీలుగుకల్లు తాగి ఐదుగురు చనిపోవడం బాధాకరమని టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్యం విధానం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడటంవల్లే ఈ దుస్థితి దాపురించిందంటూ ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో జీలుగు కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. కాకినాడ జీజీహెచ్ లో పొందుతూ తాజాగా మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రాజవొమ్మంగి మండలం లో దొడ్డిలో గిరిజనులు జీలుగుకల్లు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కల్లులో విషం కలిపారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.