రైతుల ఆత్మహత్యల పాపం వైసీపీదే

UPDATED 28th DECEMBER 2020 MONDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ వైసీపీదేనని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వినతిపత్రం అందజేసే కార్యక్రమాల్లో ఆయన సోమవారం పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా తరలివచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సుమారు 700 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, పైగా రైతులవి ఆత్మహత్యలు కాదని ప్రభుత్వం బుకాయిస్తోందని విమర్శించారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే వరుస విపత్తులతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూశారని, వారి గోడు  ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆర్డీవో మల్లిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, మహారాణి సత్రం మాజీ చైర్మన్‌ తూతిక రాజు, మున్సిపల్ ‌మాజీ వైస్ చైర్మన్‌ కొరిపూరి రాజు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు, అడబాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us