ప్రతిష్ఠాత్మకంగా జనసేన కవాతు

UPDATED 14th OCTOBER 2018 SUNDAY 8:00 PM

పెద్దాపురం: ప్రజా పోరాట యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపడుతున్న కవాతును జయప్రదం చేయాలని జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో కవాతు విజయవంతం కావాలని కోరుతూ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఈ నెల 15న పిచ్చుకల లంక నుంచి ధవళేశ్వరం వరకు ఆనకట్టపై కవాతు జరుగుతుందన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కవాతును ప్రారంభిస్తారన్నారు. అనంతరం ధవళేశ్వరం వద్ద నిర్వహించే సభలో పవన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడతారన్నారు. జనసేన సైనికులు కవాతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ భళ్లమూడి హరికృష్ణ, జాన్ బాబు, గోవిందరాజులు, కటారి శ్రీను, గేదెల బోసు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us