AP News: కరోనా విలయం, విశాఖలో అధికంగా కేసులు

Updated 26 January 2022 Wednesday 06:10 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో ఉంటే..ఇప్పుడు ఆ సంఖ్య వేలకు దాటిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 13 వేల 618 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు 2022, జనవరి 26వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 41 వేల 143 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us