గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ సెంటర్లపై సివిల్ సప్లై అధికారుల దాడులు

UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 8:30 PM

సామర్లకోట: గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ సెంటర్లపై సివిల్ సప్లై అధికారులు శనివారం పట్టణంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించడం, వంట గ్యాస్ సిలిండర్ల నుంచి ఐదు కేజీల చిన్న సిలిండర్ల లోకి అక్రమంగా ఫిల్లింగ్ చేస్తున్న వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 91 గృహ వినియోగ, చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా ఈ విషయమై  ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో కాకినాడ ఎ.ఎస్.వో. పీతల సురేష్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వై. విశ్వేశ్వరరావు, పి. సుబ్బారావు, ఎ. తాతారావు, ఎం. సూరిబాబు, స్థానిక రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us