నీరు చెట్టు విజయవంతం చేయాలి

Updated 21st April 2017 Friday 4:30 PM

పెద్దాపురం: భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం రూపొందించిన నీరు చెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ సూచనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులని ఆదేశించారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ , ఆర్డీవోలు, ఇరిగేషన్, డ్వామా, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శుక్రవారం అయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు చెట్టు కార్యక్రమాన్నిఅధికారులు తూచా తప్పకుండా ఆదేశాలను పాటించాలన్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా మంజూరు చేయబడిన చెరువులను పంచాయతీ, గ్రామసభల్లో తీర్మానం చేసి పనులు ప్రారంభించాలన్నారు. తీర్మాన పత్రాలను ఈ నెల 25 నాటికి అందచేయాలన్నారు. అలాగే నీరు చెట్టు కార్యక్రమం పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు పనులను డ్వామా,ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా  ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నూరు శాతం పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని జెడ్పి సీఈవో పద్మను ఆదేశించారు. అనంతరం పలు అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్ కలక్టర్ విజయ కృష్ణన్ , ఇరిగేషన్ ఎస్ ఈ  బి.రాంబాబు, డ్వామా పిడి నాగేశ్వరావు, ఆర్ డబ్ల్యూ ఎస్  ఎస్ఈ అప్పారావు,  ఆర్డీవో లు వి.విశ్వేశ్వరరావు, రఘుబాబు, గణేష్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.    

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us