ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి: జడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం

జడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 అక్టోబర్ 2021: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని గంగవరం జడ్పీటీసీ సభ్యురాలు ఏ. బేబీరత్నం అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆమె గురువారం సందర్శించారు. పాఠశాలలోని వసతులు గురించి ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాడు - నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం జరిగిందన్నారు. నాడు - నేడు పథకం ద్వారా పాఠశాలలు ఎంతో ఆకర్షణీయంగా తయారయినట్లు చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. అప్పారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం జడ్పీటీసీ సభ్యురాలికి వినతి పత్రం అందజేశారు. పాఠశాలలో అసంపూర్ణంగా నిలిచిపోయిన తరగతి గదులు నిర్మాణం పూర్తి చేయించాలని, అన్ని తరగతుల గదుల్లోనూ విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయించాలని, పాఠశాలలోని టాయిలెట్స్ మరమ్మతులకు నిధులు కేటాయించాలని, మంచినీటి వసతిని సమకూర్చాలని వారు కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించినట్లయితే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని వినతి పత్రంలో కోరారు. సానుకూలంగా స్పందించిన జడ్పీటీసీ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.నాగమణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us