విభజన హామీలు నెరవేర్చాలి

UPDATED 6th JULY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, విభజన హామీలన్నీ నెరవేర్చామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బళ్ళమార్కెట్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో మరోమారు స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించే సందర్భంలో ఎపికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే పదేళ్లుకావాలని డిమాండ్‌ చేసి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన బిజెపి నేడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీలను నెరవేర్చకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండలరావు, గోవిందరాజు, పెదిరెడ్డి సత్యనారాయణ, శ్రీనివాస్, గోపాల్, వెంకన్నబాబు, బాలం సత్తిబాబు, శ్రీను, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us