చినబ్రహ్మదేవంలో మహిళ దారుణ హత్య

UPDATED 13th JUNE 2017 TUESDAY 2:00 PM

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామంలో ఒక మహిళ మరో మహిళ చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం ఉదయం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే అదే గ్రామానికి చెందిన కొప్పన వెంకట లక్ష్మి (67) అనే మహిళ పల్ల సత్యనారాయణమ్మ అనే మహిళ దగ్గర చీటీపాట పాడింది. చీటిపాటకు సంబంధించి సుమారు రూ.నాలుగు లక్షలు  డబ్బులు విషయంపై ఇటీవల ఇద్దరూ ఘర్షణకు దిగారు. తనకు డబ్బులు ఇవ్వాలని సత్యనారాయణమ్మ  నిలదీసింది. అయితే ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని ఉన్నప్పుడు ఇస్తానని, లేకపోతే లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా దాటవేత ధోరణి అవలంబించడంతో సత్యనారాయమ్మ వెంకటలక్ష్మి పై కక్ష పెంచుకుంది. డబ్బులు విషయం మాట్లాడాలని వెంకట లక్ష్మిని తన ఇంటికి రమ్మనడంతో హతురాలు వెంకటలక్ష్మి  అక్కడకు వెళ్ళింది. వెంకటలక్ష్మిని హతమార్చేందుకు ముందుగా పథకం వేసుకుని ఉన్న సత్యనారాయణమ్మ ఇంటికి వచ్చిన వెంకటలక్ష్మి పై మరుగుతున్న నూనె  ఒంటిపై పోసింది. దీంతో ఆహాకారాలు చేస్తున్న వెంకటలక్ష్మిని కత్తితో మెడపై నరకడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.హతురాలికి భర్త, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి డిఎస్పీ ఎస్. రాజశేఖర్ రావు, ఎస్ఐ ఎ. కృష్ణ భగవాన్ అక్కడికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us