దళితవాడల అభివృద్ధే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం

UPDATED 20th MARCH 2018 TUESDAY 10:00 PM

పెద్దాపురం: దళితవాడల అభివృద్ధే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం అని పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) పేర్కొన్నారు. మండల పరిధిలోని చినబ్రహ్మదేవం గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆచంట రాజన్న(రాజబాబు) ఆధ్వర్యంలో నిర్వహించిన దళితతేజం కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొని మాట్లాడారు. దళితుల ఆర్ధికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దళితుల సంక్షేమాన్ని కాంక్షించే ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), ఎంపీపీ గుడాల రమేష్, జడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు, మాట్లాడుతూ దళితులు ఆన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దళితవాడల్లో తిరిగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు (రాము), అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనె రామారావు, మన్యం దేవబాబు, సైనం సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us