TTD:శ్రీవారికి భక్తులకు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుండి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు

UPDATED 13th FEBRUARY 2022 SUNDAY 05:30 PM

తిరుమల: తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుండి ఆఫ్ లైన్ లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. కోవిడ్ – 19 కారణంగా నిలిపి వేసిన ఆఫ్ లైన్ టికెట్ల జారీని టీటీడీ ఈ నెల 15 నుండి పునరుద్ధరించనుంది. 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది.

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది. ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ మేరకు రోజుకు 25వేల నుంచి 30 వేల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆఫ్ లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

రోజుకు 15 వేల సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాలలో టోకెన్లు జారీ చేయనుంది. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసింది.

గత ఏడాది రోజుకు 2వేల చొప్పున టికెట్లు జారీ చేసినా.. భక్తుల రద్దీ దృష్ట్యా నిలిపేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే రోజుకు 5 వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కూడా దాదాపు వందశాతం పూర్తవడంతో ఆఫ్ లైన్ టోకెన్ల సంఖ్యను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఆఫ్ లైన్ లో 15వేల టోకెన్లు జారీ చేస్తుండటంతో ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40వేలు దాటే అవకాశముంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆఫ్ లైన్ లో టోకెన్లు తీసుకునేవారు కూడా కరోనా నెగెటివ్ రిపోర్ట్, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు చూపాల్సి వుంటుంది. అలాగే క్యూలైన్లలో కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us