అన్నవరం.. భక్తజనసంద్రం..

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: అన్నవరం సత్యదేవుని ఆలయ ప్రాంగణాలు భక్తజనసంద్రమయ్యాయి. కార్తికమాసంలో ఆఖరి సోమవారం కావడంతో స్వామిదర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రికే కొండపైకి వేలాది మంది భక్తులు చేరుకోగా రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున ఒంటిగంట నుంచి వ్రత టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. రెండు గంటల నుంచి వ్రతాలు, సర్వదర్శనాలకు అనుమతించారు. మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. 10,811 వ్రతాలు, 47 కల్యాణాలు జరిగాయి. వ్రతాల ద్వారా రూ.54.23 లక్షలు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.29.54 లక్షలు, మొత్తం రూ.91.42 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈవో త్రినాథరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాజమహేంద్రవరానికి చెందిన ఎన్‌.సూర్యారావు నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం ఇచ్చారు. కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు కొండ దిగువన తొలిపావంచాల వద్ద స్వామిని దర్శించుకున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us