దర్గా ధ్వంసంపై ముస్లింల ఆందోళన

UPDATED 20th JANUARY 2018 SATURDAY 2:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం-సామర్లకోట ప్రధాన రహదారిలో స్థానిక సుధా ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ముస్తాఫా ఖాదర్ వలీ (ఎర్రమట్టి దర్గా)ను ఆర్ అండ్ బీ అధికారులు రహదారి విస్తరణలో భాగంగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ధ్వంసం చేయడంపై ముస్లింలు ఆందోళనకు దిగారు. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దర్గాను ధ్వంసం చేయడం ముస్లింల మత విశ్వాసాలకు భంగం కలిగించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ గంటసేపు నిలిచిపోయింది. వెంటనే సిఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ రంగంలోకి దిగి ముస్లిం మతపెద్దలతో మాట్లాడారు. దర్గాకు ఇబ్బంది లేకుండా రహదారి విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సుభానీ, అభీద్ భాయ్, మద్గుల్ జానీ, గౌస్, జానీ, రెహమాన్, షేక్ రాజా, భహుద్దూర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us