చలాన్లు తరచూ వేస్తున్నారని నడిరోడ్డుపై బైక్‌కు నిప్పు

ఆదిలాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ట్రాఫిక్‌ పోలీసుల తీరును నిరసిస్తూ ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్‌ అనే వ్యక్తి స్థానిక అంబేడ్కర్‌ కూడలి సమీపంలోబైక్‌పై వెళుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు ఫొటో తీసి ఈ-చలానా కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూపోలీసులు చలాన్లు వేస్తున్నారంటూ నడిరోడ్డుపై తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. గమనించిన పోలీసులు మంటలను ఆర్పేశారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us