మే 14 నుంచి అన్నవరం సత్యనారాయస్వామి కల్యాణోత్సవాలు

* 15న స్వామివారి దివ్యకల్యాణం
* 19 వరకు కొనసాగనున్న వేడుకలు
* ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్‌బాబు

UPDATED 8th MAY 2019 WEDNESDAY 9:00 PM

అన్నవరం: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. ఈనెల 15వ తేదీన స్వామివారి దివ్యకల్యాణం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఉదయం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్‌బాబు మాట్లాడుతూ సుమారు రూ.65 లక్షల వ్యయంతో సత్యనారాయణ స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా ఈనెల 14 నుంచి 19 వరకు ఆరు రోజులపాటు వ్రతాలు మినహా ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణం రోజున ట్రాఫిక్‌ నియంత్రణ, ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈనెల 14న సాయంత్రం 4.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, కుమార్తెను చేయడం, అంకురార్పణ, ధ్వజారోహణ, రాత్రి ఏడు గంటలకు ఎదుర్కోలు ఉత్సవం,15న స్వామి, అమ్మవార్లకు వాహనసేవ, గ్రామోత్సవం స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం, 16న స్థాలిపాక హోమాలు, అరుంధతీ నక్షత్ర దర్శనం, రావణ, పొన్న వాహనాలపై గ్రామోత్సవం, 17న మహదాశీర్వచనం, పండిత సదస్యం, పండిత సత్కారము (వేదశాస్త్ర సభ), వన విహారోత్సవం, వెండి రథంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు,18న శేష హోమం, కొండ దిగువన పంపా సరోవరంలో శ్రీ చక్రస్నానం, సాయంత్రం నాకబలి, దండియాడింపు, కంకణ విమోచన తదితర కార్యక్రమాలు జరుగుతాయని, 19న రాత్రి నిర్వహించే శ్రీ పుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఈవో తెలిపారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us