AP News: సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఎమ్మెల్యే సోదరుని కుటుంబం గల్లంతు

దుర్గ్ (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే బంధువులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్మోహన్ రెడ్డి కుటుంబం కారులో వెళ్తుండగా.. దుర్గి మండలం అడిగొప్పుల వద్దకు రాగానే అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మదన్మోహన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు. కారులో ఉన్న ఆయన భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సాగర్ కాలువలో పడిన కారును అధికారులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. కారును వెతికేందుకుకు పెద్ద క్రేన్ ను తీసుకొచ్చారు. ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధికారులు కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us