ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో నాక్ బృందం

UPDATED 10th AUGUST 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: నేషనల్ అక్రిడేషన్ అండ్ ఎసెస్మెంట్ కౌన్సిల్ బృందం((ఎన్ఎఎసి) గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలను ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు పర్యటించి పరిశీలించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు నాక్ గుర్తింపు కొరకు దరఖాస్తు చేశామని, విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో విద్యా సంస్థలకు ఇచ్చే అక్రిడేషన్ పరిశీలించేందుకు ప్రొఫెసర్ అతుల్ చౌదరి (వైస్ ఛాన్సలర్ వి.ఎస్.ఎస్.వి.టి. యూనివర్సిటీ (సంబల్పూర్ ఒరిస్సా), ప్రొఫెసర్ ఎస్. శేఖర్ సర్కార్  ప్రొఫెసర్, ఎంబిఎ విభాగాధిపతి  తేజ్ పూర్ యూనివర్సిటీ, అస్సాం), ప్రొఫెసర్ ఎం.కె. ఝా ( డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ అటల్ బిహారి వాజపేయి గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రగతినగర్, సిమ్లా) లతో కూడిన ముగ్గురు సభ్యుల నాక్ బృందం కళాశాల మౌలికవసతులు, ల్యాబ్స్, లైబ్రరీ, కాంటీన్, హాస్టల్ వసతులు, సౌరవిద్యుత్ సహిత కాలుష్యరహిత పర్యావరణం, విద్యార్థులు రూపొందించిన స్టార్ట్ అప్ లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us