19న దివిలి కిట్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021: పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు కళాశాల ఛైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 19 కంపెనీల్లో వివిధ ఉద్యోగాల కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సంస్థలైన టి.సి.ఎస్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్, కోజెంట్ ఈసర్వీసెస్, పిఎసిపిఎల్, డెక్కన్ కెమికల్స్, ఇండిగో ఎయిర్ లైన్స్, హోండాయ్ మోస్, అమెజాన్ ఎస్.డి.వి.వి.ఎల్ విదాబ్ హెల్త్ తదితర సంస్థల్లో బి.పి.వో, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రిలేషన్ షిప్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, ట్రైనీ ప్రొడక్షన్, లోడర్స్, డ్రైవర్స్, కస్టమర్ సేల్స్ అసోసియేట్, లాజిస్టిక్స్ తదితర ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు ఉంటాయన్నారు. అలాగే ఉద్యోగాలను బట్టి వేతనం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 19వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు సర్టిఫికెట్స్ జెరాక్స్ లతో హాజరుకావలని ఆయన కోరారు. పూర్తి వివారాలకు 9010695895 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us