TTD: తిరుమల శ్రీవారికి గోదా మాలల సమర్పణ.. వైదికోక్తంగా కాకబలి

తిరుమల (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : శ్రీగోదాదేవి పరిణయోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి మూలవిరాట్ కు ఆదివారం ఉదయం గోదామాలలు సమర్పించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీగోదాదేవి చెంత నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుంచి తిరుమల పెద్దజియర్ స్వామివారి మకానికి ఆదివారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం అక్కడ నుంచి మంగళ వాయిద్యాల నడుము ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.

★ వైదికోక్తంగా 'కాకబలి...

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏటా కనుమ పండుగను పురస్కరించుకొని ఉదయపూర్వం నిర్వహించే కాకబలి' కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఆర్చకులు పసుపు, కుంకుమను వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు. ఈకార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us