UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 14:00 PM
విజయవాడ (రెడ్ బీ న్యూస్): నగరంలోని కుమ్మరిపాలెం సెంటర్ అపార్ట్మెంట్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న దీక్షిత అనే బాలిక తల్లిదండ్రులను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం దీక్షిత ఆత్మహత్య చేసుకోవడం మనసు అంగీకరించడం లేదన్నారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పడుతున్న వేదన కలిచివేసిందని అన్నారు. సూసైడ్ నోట్లో అంశాలను అధికారులు స్టడీ చేస్తున్నారని తెలిపారు. నిందితులను శిక్షించడం కంటే ఇంకా అతీతమైన విధంగా చేయాలని కోరుకుంటున్నానన్నారు. అర్థగంటకు పైగా బాలిక తల్లిదండ్రులను రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఓదార్చారు.