అన్నవరంలో భక్తజన సందడి

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: అన్నవరం సత్యనారాయణ స్వామివారి జన్మ నక్షత్రం మఖ పర్వదినం సందర్భంగా శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాతం, 2 గంటలకు మహన్యాసం తర్వాత 3 గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్టుకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సత్యదీక్షల విరమణ, రద్దీ నేపథ్యంలో అభిషేక సమయంలో క్యూలైన్ల ద్వారా (అంతరాలయం బయట నుంచి) భక్తులు దర్శించుకునే అవకాశం కల్పించారు. అలంకరణ, నివేదనకు 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు దర్శనాలు నిలుపుదల చేసి ఆ తర్వాత సర్వదర్శనాలకు అనుమతించారు. సత్యదీక్షా పరులు స్వామి సన్నిధికి చేరుకుని ఇరుముళ్లు సమర్పించారు. నిత్యకల్యాణ మండపంలో ఉచిత వ్రతాలు నిర్వహించారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. నిత్యాన్నదానంలో భోజన సౌకర్యం కల్పించారు. ఈవో వి.త్రినాథరావు, పవనగిరి స్వామీజీ పాల్గొన్నారు. 5,335 వ్రతాలు జరిగాయి. వ్రతాలు, కల్యాణాలు, దర్శనాలు, పూజలు, ప్రసాదవిక్రయాల ద్వారా రూ.56.04 లక్షల ఆదాయం సమకూరింది.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us