UPDATED 31st JULY 2022 SUNDAY 03:30 PM
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా, శ్రీవారి పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 9, 10వ తేదీల్లో వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనాన్ని టీటీడీ నిలుపుదల చేసింది.