IND vs SL: పుష్ప ట్రెండ్‌లో జాయిన్ అయిన విరాట్ కోహ్లీ

UPDATED 6th MARCH 2022 SUNDAY 07:50 PM

IND vs SL: పుష్పమానియా రంగాలకు అతీతంగా పాకింది. ఇప్పటికే పుష్ప మూమెంట్ ను రవీంద్ర జడేజా ఇమిటేట్ చేసి అభిమానులను అలరించగా.. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం ఆ జాబితాలో చేరాడు. విరాట్ చేసిన ఈ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండియా వర్సెస్ శ్రీలంకల తొలి టెస్టులో భాగంగా జరిగి మూడో రోజు స్టేడియంలో ఫీల్డింగ్ చేస్తూనే మూమెంట్ చేశాడు. మొహాలీ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్ లో వందో టెస్టులో సెంచరీ స్కోరు ఊహించిన అభిమానులను నిరాశపరిచాడు. 45పరుగుల తర్వాత ఎంబుల్దేనియా బౌలింగ్ లో అవుట్ అవడం అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురిచేసింది.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కెరీర్‌లోనే బెస్ట్ స్కోరు నమోదు చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 175 పరుగులు, బౌలింగ్ లో 9వికెట్లు పడగొట్టి ఘనత సృష్టించాడు.

మొహాలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ విజయం గెలుపొందింది. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us