భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి : కలెక్టర్ హరికిరణ్

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: జాతీయ రహదారుల విస్తరణ, జాతీయ రహదారులతో అనుసంధానం, రహదారుల పటిష్టకరణ, వంతెనల నిర్మాణం, బైపాస్ లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో పురోగతిపై కలెక్టర్ హరికిరణ్, ఇన్చార్జ్ జేసీ (ఆర్), జేసీ (డీ) కీర్తి చేకూరి; ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డబ్ల్యూ), జేసీ (హెచ్) ఎ. భార్గవ్ తేజతో కలిసి జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, రైల్వే తదితర శాఖల అధికారులతో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. చింతూరు/ఎటపాక నుంచి కుంటకు రహదారి ఆధునికీకరణ (ఎన్‌హెచ్-30), ఎన్‌హెచ్-516ఈ, నర్సాపూర్ బైపాస్ (ఎన్‌హెచ్-216), కాకినాడ పోర్టును ఎన్‌హెచ్-16కు అనుసంధానించే సామర్లకోట అచ్చంపేట జంక్షన్ రహదారి, ఎన్‌హెచ్-216 విస్తరణ (కత్తిపూడి దిండి) తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులపై డివిజన్ల వారీగా సమీక్షించారు. సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ (కాలా) అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. భారత్ మాల ప్రాజెక్టు కింద తమ్మ వరం-అన్న వరం రహదారికి సంబంధించి ఈ ఏడాది జూన్‌లో 3ఏ నోటిఫికేషన్ ప్రచురణ దగ్గరి నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ప్రక్రియ వేగవంతానికి సమన్వయ శాఖలు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని, లక్ష్యాల మేరకు చట్టపర కార్యకలాపాలను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కియా, రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, కాకినాడ ఆర్డీవో ఎజీ చిన్నికృష్ణ, అమలాపురం ఆర్డీవో ఎస్ఎస్ వీబీ వసంతరాయుడు, పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ, ఎహె ఏఐ పీడీ (రాజమహేంద్రవరం) డి.సురేంద్రనాథ్, ఆర్ అండ్ బీ-ఎన్ హెచ్ ఈఈ (విశాఖపట్నం) జీవీ భాస్కరరావు, ఎస్ఈ (ఆర్ అండ్ బీ) కె.హరిప్రసాద్ బాబు, ఎస్ఈ పీఆర్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us