ఖరీదైన సాహో

UPDATED 24th JUNE 2017 SATURDAY 10:00 PM

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారంటే ప్రభాస్ స్థాయి ఇప్పుడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రానున్న రోజులలో ఈ హీరో చేసే సినిమాలన్నీ దాదాపు భారీ బడ్జెట్ చిత్రాలుగానే ఉంటాయని అర్ధమవుతుంది. తాజాగా సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ "సాహో" చిత్రాన్ని చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ మొదలు కాగా, కీలక పాత్రలపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. మరి కొద్ది రోజులలో ప్రభాస్ కూడా టీంతో కలవనున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "సాహో" మూవీని ఇండియాలోనే కాకుండా ఖరీదైన లొకేషన్లు అబుదాబి, రొమేనియా వంటి ప్రాంతాలలో చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కత్తి ఫేం నీల్ నితిన్ ముఖేష్‌ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us