Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం

UPDATED 1JULY 2022 FRIDAY 03:10 PM

Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మో03:త్సవాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, సదా భార్గవి ముఖ్య భద్రతాధికారి నరసింహ కిషోర్ సమావేశమయ్యారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి సాలపట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు.

ఏడాది బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయని తెలిపారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అక్టోబర్ 1న గరుడసేవ, అక్టోబర్ 2 స్వర్ణ రథం, అక్టోబర్ 4 న స్వర్ణరధం, అక్టోబర్ 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.

సెప్టెంబర్ 27న ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us