AP News: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బాలయ్య.. సీఎం జగన్‌‌కు విజ్ఞప్తి

Updated 27 January 2022 Thursday 06:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీ రాష్ట్రంలో ఉగాది నుంచి 26 జిల్లాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపట్లోనే.. అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థనలు, అభ్యంతరాలు వస్తున్నాయి. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేయాలని ఓ చోట.. తమ నియోజకవర్గాన్ని వేరే జిల్లాలో కలపాలని మరో చోట ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ డివిజన్ మార్చాలని కొందరు.. తాము చెప్పినట్లే.. జిల్లాను ఏర్పాటు చేయాలని ఇంకొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, సినీ నటుడు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అయితే..హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఉన్న హిందూపురం వ్యాపారపరంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికపరంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాబట్టి.. హిందూపురం పార్లమెంట్ కేంద్రంగా కొత్త జిల్లాని ప్రకటిస్తూ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us