పూరి ‘మెహ‌బూబా‘ టీజ‌ర్ అదుర్స్..

UPDATED 9th FEBRUARY 2018 FRIDAY 6:30 PM

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కు ఇటీవ‌ల వ‌రుస‌గా ప్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. ఐదు వ‌రుస ప్లాపుల త‌ర్వాత పూరి తాజాగా త‌న త‌న‌యుడు ఆకాష్ తో మెహ‌బూబా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే అస‌లు పూరి మార్క్ టేకింగేనా ఇది అన్నంత ఆశ్చ‌ర్యంగా కలుగుతోంది. 53 సెక‌న్ల పాటు ఉన్న ట్రైల‌ర్‌లో ఇండో – పాక్ స‌రిహ‌ద్దు వ‌ద్ద యుద్ధ నేప‌థ్యం, హెలీకాఫ్ట‌ర్ల‌తో ఛేజింగ్, సైనికుల‌పై హెలీకాఫ్ట‌ర్ల నుంచి బాంబులు వేయ‌డం, యుద్ధ స‌న్నివేశాలు అదిరిపోయాయి. సినిమాటోగ్ర‌ఫీలో కశ్మీర్ – పాక్ స‌రిహ‌ద్దులను మిరుమిట్లు గొలిపేలా ప్రెజంట్ చేశాడు. ఇక హీరో త‌న ప్రియురాలు కోసం స‌రిహ‌ద్దులో ఎలాంటి రిస్క్ చేశాడ‌న్న నేప‌థ్యంలో మెహ‌బూబా స్టోరీ ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే పూరి మార్క్‌కు భిన్నంగా తెర‌కెక్కిన మెహ‌బూబా పూరికి, త‌న‌యుడికి క‌లిసి హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us