అన్ని సేవలు సచివాలయాల్లోనే :కలెక్టర్ మురళీధర్ రెడ్డి

గంగవరం: 6 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): వివిధ రకాల సేవలు, ధృవపత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని పొందేందుకు ప్రజలెవ్వరూ ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా వీటి మంజూరు ప్రక్రియను గ్రామ సచివాలయాలలో కేంద్రీకృతం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నెల్లిపూడి గ్రామ సచివాలయం, కొత్తాడ గ్రామ సచివాలయలు, గొరగుమ్మి వెంకటరామాపురం మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాలలో నాడు-నేడు పనులు, గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ తీరును ఆయన శనివారం పరిశీలించి మాట్లాడారు. విధి నిర్వహణలో బాగా పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లును గుర్తించి వారి ఫోటోలను సంబంధిత గ్రామ సచివాలయాలలో ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా అంకితభావంతో పనిచేస్తున్న గ్రామ సహాయకులకు రానున్న ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంసాపత్రాలు బహుకరించడం జరుగుతుందన్నారు. ఆధార్, ఈకేవైసీ సీడింగ్ అప్ లోడ్ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో ప్రభుత్వ పధకాలు గురించి గ్రామ వాలంటీర్లు విస్తృతంగా అవగాహన పెంపొందించి ఆయా కుటుంబాలలో అర్హత కలినవారికి పథకాలు వర్తింపజేస్తూ లబ్దిని చేకూర్చాలని ఆదేశించారు. ఏఒక్క లబ్దిదారుడు తహశీల్దార్, డివిజనల్, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లకూడదని, అలా వెళ్లిన పక్షంలో సంబంధిత గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్లుపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కేవలం సామాజిక అవసరాలు, విపత్తులు, ఉపద్రవాలు జరిగినపుడు మాత్రమే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రెగ్యులర్ హక్కులు గురించి గ్రామ సచివాలయాలను ఆశ్రయించాలని కోరారు. అనంతరం వైఎస్ఆర్ ఎస్.పీ కిట్లను ఆయన గర్భిణీ స్త్రీలకు పోషకాహారం నిమిత్తం పంపిణీ చేశారు. అలాగే ఎటపాక రెవిన్యూ డివిజన్ గ్రామ సచివాలయ సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని, నెట్ కవరేజ్ లేనప్పటికి ఎంతో శ్రమించి నిర్దేశిత లక్ష్యాలు సాధించారని జిల్లా కలెక్టర్ వారిని ప్రశంసించారు. వెంకటరామాపురం మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాలను ఆయన సందర్శించి నాడు-నేడు పనులు పురోగతిని పరిశీలించారు. సిమ్మెంటు సరఫరాకు మార్గనిర్దేశం చేసినప్పటికీ పనుల జాప్యం పట్ల జె.ఈ వెంకటేశ్వరరావు పనితీరుపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్య, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు, ఎంపీడీవో జాన్ మిల్టన్, తహశీల్దార్ వీర్రాజు, సీడీపీవో నీలవేణి, ఎంఈవో మల్లేశ్వరరావు, హెచ్.ఎం శ్రీనివాసరెడ్డి, పంచాయితీ కార్యదర్శి సత్యవేణి, వైద్యులు అనూష, ఆనంద్, సత్యతేజ్, తదితరులు పాల్గొన్నారు
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us