టీడీపీని భూస్థాపితం చేద్దాం

UPDATED 25th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: అన్యాయాలకు, అరాచకాలకు, అవినీతికి తెలుగుదేశం పాలన నిలయమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు విమర్శించారు. స్థానిక ఏడవ వార్డులో సోమవారం నిర్వహించిన రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలపై విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలనను భూస్థాపితం చేద్దామని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో టిడిపి అనేక హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టారని, ఎన్నికలయ్యాక డిజిటల్‌ అభివృద్ధి చూపిస్తూ ప్రజల్ని మోసగించారని, ఎక్కడా అభివృద్ధి ఛాయలు లేవన్నారు. అంతా ఆర్భాటపు ప్రచారంతో, జనం డబ్బు దుబారాతో నాలుగున్నర ఏళ్ల కాలాన్ని గడిపారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. ఓటుతో నిజాయితీని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు దొరబాబుకు దారి పొడవునా పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, కౌన్సిలర్ ఊబా జాన్ మోజేష్, శెట్టిబత్తుల దుర్గ, సంగినీడి భావన్నారాయణ, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, ఎలిజబెత్ రాణి, సిద్దిరెడ్డి సత్యనారాయణ, మద్దాల శ్రీను, సేపేని సురేష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us