Chandrababu: ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించిన చంద్రబాబు

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 02:00 PM

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించారు. విజయవాడ పటమటలోని అశోక్ బాబు నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. అశోక్ బాబుతో మాట్లాడారు. సీఐడీ అరెస్టు తదనంతర పరిణామాలపై చంద్రబాబు ఆరా తీశారు. విద్యార్హతపై తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని అశోక్ బాబును గురువారం అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 18 గంటలపాటు తమ అదుపుల ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ కోర్టు ఇన్ ఛార్జి న్యాయమూర్తి సత్యవతి అశోక్ బాబుకు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us