వైఎస్సార్‌సీపీతోనే రాజన్న రాజ్యం

UPDATED 3rd APRIL 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే రాజన్న రాజ్యం రానుందని తోట రాంజీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిని తోట వాణి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని వంగా గీతకు మద్దత్తుగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం పట్టణంలో పలు వార్డుల్లో ప్రతీ గడపకూ తిరుగుతూ నవరత్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఆయనకు పలువురు మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిని తోట వాణి కుమారుడు తోట రాంజీ మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలు ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ఇంటికి పంపాలని, పసుపు-కుంకుమ పేరిట ఇచ్చే తాయిలాలకు ఎవరూ మోసపోవద్దని సూచించారు. మన భవిష్యత్‌ బాగుండాలంటే జగనన్నను సీఎం చేసుకుందామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే నాలుగు దఫాలుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తారని, అలాగే వడ్డీలేని రుణాలు అందించి ఆదుకోవడం జరుగుతుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు నాలుగు దఫాలుగా రూ.75 వేలు సాయం అందిస్తామని, పిల్లల్ని చదివించే తల్లులకు సంవత్సరానికి రూ.15వేలు మీ ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. అలాగే మీ పిల్లల్ని డాక్టర్, ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుకోవడానికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేసి ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రతీ కుటుంబానికి లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరే విధంగా నవరత్నాలు పథకాలు రూపొందించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ  పేదవారికి ఇళ్లు, ప్రతీ ఎకరాకు నీరు, అవినీతి పోవాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దాల శ్రీను, సేపేని సురేష్, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజేష్, నేతల వెంకటలక్ష్మి, నేతల హరిబాబు, యుద్ధాని కృష్ణ, డాక్టర్ పసల సత్యానందం, నక్కా జానకిరామయ్య, మసకపల్లి సత్యనారాయణ, భావన్నారాయణ, శెట్టిబత్తుల దుర్గ, చిత్తూరు లక్ష్మణరావు, లోవాచారి, ఎలిజిబెత్ రాణి, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us