వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి పట్టపగలే బంగారు నగల అపహరణ

UPDATED 31st AUGUST 2017 THURSDAY 2:00 PM

పెద్దాపురం : పట్టపగలే వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 కాసుల బంగారు నగలను అపహరించుకుపోయిన సంఘటన పెద్దాపురం పట్టణంలో గురువారం ఉదయం సంచలనం కలిగించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో కబాడీ వీధిలో నివాసం ఉంటున్న సెలా లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఇంటి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని యువకుడు ఆమె కళ్ళల్లో కారం కొట్టి ఆమె మెడలో ఉన్న నల్లపూసల తాడు, బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు అక్కడకు చేరుకునే సమయానికి దుండగుడు పరారయ్యాడు. చోరీ సొత్తు విలువ సుమారు రూ. రెండు లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ఇటీవల పట్టణంలో దొంగతనాలు పెరగడంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us