బ‌న్నీ కాంప్లిమెంట్‌కి ప్రియా ప్రకాష్ ఫుల్ జోష్

UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 11:30 AM

ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న ప్రియాకి స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మాణిక్య మలరాయ పూవీ అనే సాంగ్ లో ఈ 18 ఏళ్ళ అమ్మాయి కనుసైగ ఎందరో హృదయాలని కొల్లగొట్టింది. ఫిబ్రవరి 9 నుండి ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కొంటెచూపుతో కుర్ర‌కారుని గిలిగింత‌లు పెట్టిన సోగ‌క‌ళ్ళ చిన్న‌ది ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ప్రియా ఎక్స్‌ప్రెష‌న్స్‌కి ఫిదా అయ్యారు. మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్‌'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్‌లో ప్రియా త‌న ల‌వ్ ఎక్స్‌ప్రెస్ చేసే విధానానికి బ‌న్నీ కూడా ఫ్లాట్ అయ్యాడు. వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో వీడియోని షేర్ చేస్తూ.. ఈ మ‌ధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియో చూడ‌లేదు. సింప్లిసిటీకి ఉన్న ప‌వ‌రే ఇది. నాకు బాగా న‌చ్చింది అంటూ రీసెంట్‌గా కామెంట్ పెట్టాడు. బ‌న్నీ కామెంట్స్‌పై తాజాగా స్పందించింది మ‌ల‌యాళ కుట్టి  అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్‌ని ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేను. అభిమానుల నుండి ఎంత స్పంద‌న వ‌చ్చిన‌, స్టైలిష్ స్టార్ కాంప్లిమెంట్ మాత్రం మ‌ర‌చిపోలేనిది. కేర‌ళ‌లో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అని తెలిపింది. ప్రియ. త‌న డెబ్యూ చిత్రం ఓరు అదార్ లవ్ మార్చి 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ప్ర‌స్తుతం త‌న సహ నటుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌తో కలిసి ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. త్వ‌ర‌లో ఈ అమ్మ‌డు నిఖిల్ సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానుంద‌ని టాక్స్ వినిపిస్తున్నాయి.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us