UPDATED 22 MAY 2022 SUNDAY 06:00 AM
Vijayawada Kanaka Durga Temple : విజయవాడ దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనను మరింత కఠినతరం చేయనున్నారు. ఏఈవో స్థాయి ఉద్యోగి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు తెల్లని దుస్తులు తప్పనిసరి చేయనున్నారు.
అంతరాలయంలో పంచె కట్టకపోయినా, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించకపోయినా రూ.200 జరిమానా విధించనున్నారు. అలాగే సిబ్బందికి ఐడీ కార్డు లేకపోతే రూ.100 జరిమానా విధించనున్నారు.
అంతేకాదు సమయపాలన పాటించకపోయినా, అలసత్వం వహించినా చర్యలు తప్పవన్నారు. డ్రెస్ కోడ్, ఐడీ కార్డ్, సమయపాలన, అలసత్వం విషయాల్లో మూడు సార్లు తప్పిదం చేస్తే సిబ్బందికి ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని ఈవో హెచ్చరించారు.
ఇక అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తేల్చి చెప్పారు. భక్తుల డ్రెస్ కోడ్ కు సంబంధించి త్వరలోనే సర్కులర్ జారీ చేసే అవకాశం ఉంది.