హుండీల చోరీ నిందితుడు అరెస్ట్

UPDATED 6th FEBRUARY 2018 TUESDAY 8:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి దేవాలయంలో ఇటీవల హుండీల చోరీలకు పాల్పడిన పెద్దాపురం మండలం తిరుపతికి చెందిన బోసారపు వెంకట దుర్గను మంగళవారం అరెస్ట్ చేశారు. పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు ఆదేశాల మేరకు సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్సై శ్రీనివాస్ వాహనాలు తనిఖీలు చూస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న  వెంకటదుర్గను అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద రూ.10 వేలు చిల్లర లభించిందని, ఇంకా అతడిని ఆరా తీయగా భీమేశ్వరస్వామి దేవాలయంలో హుండీలు చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించినట్లు చెప్పారు. చోరీ సొమ్ము స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు డిఎస్పీ తెలిపారు.    

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us