AP News: సిద్ధమవుతోన్న ఉద్యోగుల సమ్మె నోటీసు

Updated 24 January 2022 Monday 16:00 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఉద్యోగుల సమ్మె నోటీసు సిద్ధమవుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతల భేటీ కొనసాగుతోంది. మరో గంటలో సచివాలయానికి సమితి నేతలు చేరుకోనున్నారు. 3 పేజీలతో సమ్మె నోటీసును పీఆర్సీ సాధన సమితి రూపొందించింది. నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమ్మె నోటీసులో వెల్లడించారు. ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ను సమ్మె నోటీసులో పీఆర్సీ సాధన సమితి పొందుపరిచింది. సమ్మె నోటీసుపై స్టీరింగ్ కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు వచ్చిన నష్టం, పీఆర్సీ జీవోలపై పెద్ద ఎత్తున వస్తున్న అసంతృప్తి దృష్ట్యా ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె వైపే మొగ్గు చూపారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి (7వ తేదీ) సమ్మెకు వెళ్లాలని పీఆర్సీ సాధన కమిటీ నిర్ణయించింది. ‘ఈ పీఆర్సీతో ప్రతి ఉద్యోగికీ నష్టమే. దీనికి అంగీకరించేది లేదు’ అని పీఆర్సీ సాధన సమితి తేల్చి చెప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, సచివాలయ, ఎన్‌ఎంఆర్‌, ప్రజా రవాణాతోపాటు ఇతర అన్ని విభాగాలు, శాఖల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపింది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us