మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

UPDATED 7th JULY 2018 SATURDAY 1:00 PM

సామర్లకోట: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక సంతమార్కెట్లో రూ.15 లక్షలు ఆర్.కె.వి.వై నిధులతో నూతనంగా నిర్మించిన చేపల మార్కెట్ భవనాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఎన్నో ఏళ్ళుగా శిథిలమైన చేపల షెడ్లులో మత్స్యకారులు చేపలను అమ్ముకునే వారని, దీనిని దృష్టిలో పెట్టుకుని మత్స్యశాఖ నిధులు నుంచి ఈ భవనాలను నిర్మించడం జరిగిందని తెలిపారు. మత్స్యకారులకు సబ్సిడీలపై ద్విచక్రవాహనాలు, వలలు, తదితర పరికరాలను ప్రభుత్వం అందచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కంచర్ల సుష్మామోహనీ మధు, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, కుమారరామ భీమేశ్వరసామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఫిషర్ మెన్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు సీతా నాగేశ్వరరావు, పెమ్మాటి వీరభద్రవర్మ, శ్రీ సిద్ది వినాయక మత్స్య వర్తక సంఘం అధ్యక్షులు మారారి అమ్మిరాజు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. కరుణాకరన్, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, గుమ్మళ్ళ రామకృష్ణ, వార్డు కౌన్సిలర్లు, మత్స్యకారుల సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us