రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి

UPDATED 20th DECEMBER 2020 SUNDAY 9:00 PM

తుని(రెడ్ బీ న్యూస్): తుని పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ విశాఖ జిల్లా కోటవురట్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. తల్లిదండ్రులు తుని వద్ద ఇటుక బట్టీలో కూలి పని చేసుకుంటుండగా వారి పిల్లలు ఇద్దరు కోటవురట్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం కావడంతో తండ్రి తన ఇద్దరు పిల్లలు దుర్గ (17), తాతాజీ (7) లను కోటవురట్ల నుంచి ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us