TS News : తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోంది: బండి సంజయ్‌

Updated 24 January 2022 Monday 16:15 PM

కరీంనగర్ (రెడ్ బీ న్యూస్) : వేములవాడలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత బండి సంజయ్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వేములవాడకు 200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమయ్యాయని నిలదీశారు. వేములవాడ అభివృద్ధిపై సమీక్ష చేయడానికి కేసీఆర్‌కు సమయం లేదా? అని ప్రశ్నించారు. వేములవాడ రాజన్నకే కేసీఆర్ శఠగోపం పెడుతున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us