Crime News: ఎలుకల మందు పెట్టి చెల్లెలిని చంపిన అక్క: అసలు విషయం తెలిస్తే షాక్

UPDATED 12th APRIL 2022 TUESDAY 09:00 PM

Nandyala Crime News: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కొత్తపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎలుకల మందు పెట్టి చెల్లెలిని అక్క హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు మేరకు ఎదురుపాడు గ్రామానికి చెందిన జానకమ్మ తన తోడబుట్టిన చెల్లి తిరుమలేశ్వరిని ఎలుకల మందు పెట్టి చంపింది. జానకమ్మకు జనార్దన్ తో కొంతకాలం క్రితం పెళ్లి జరిగింది. అయితే పెళ్ళైన కొన్ని రోజులకు జానకమ్మ అనారోగ్యం భారిన పడడంతో..కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రెండేళ్ల క్రితం తిరుమలేశ్వరిని జనార్దన్ పెళ్లి చేసుకున్నాడు. ఈక్రమంలో జానకమ్మని దూరం పెట్టిన జనార్దన్ తిరుమలేశ్వరికి బాగా దగ్గరయ్యాడు.

దీంతో తాను కట్టుకున్న భర్త తన నుంచి దూరమౌతున్నాడని, చెల్లెలితో భర్త ఎక్కువగా ఉండటంతో జీర్ణించుకోలేని జానకమ్మ తిరుమలేశ్వరికి అన్నంలో ఎలకల మందు పెట్టి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని భర్త జనార్దన్ తో కలిసి సమీపంలోని అడవిలో పడేసి వచ్చారు. ఘటనపై మంగళవారం సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జానకమ్మ, జనార్దన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమేరకు విచారణ చేస్తున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us