ప్రధానోపాధ్యాయుడు తర్వాత వ్యాయమ అధ్యాపకుడిదే అత్యంత ప్రాధాన్యత

UPDATED 9th MARCH 2018 FRIDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో తూర్పుగోదావరి జిల్లా వ్యాయమ అధ్యాపకుల సదస్సు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ -2018 శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 9, 10 తేదీలలో రెండురోజుల పాటు నిర్వహించనున్న ప్రారంభ కార్యక్రమానికి ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్, జిల్లా వ్యాయామ అధ్యాపకుల సంఘ గౌరవ అధ్యక్షుడు నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షత వహించగా, కాకినాడ రీజినల్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ముఖ్య అతిధిగా, గౌరవ అతిథులుగా జి. భానుమూర్తి రాజు, ఎం. మనోహర్, డాక్టర్ పి. జాన్సన్, ఆదిత్య వ్యాయమ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజి, కె. స్పర్జన్ రాజు, వి. రాజశేఖర్, ఎల్. జార్జ్, తదితరులు హాజరైనారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తర్వాత అత్యంత ప్రాధాన్యత వ్యాయమ అధ్యాపకులదేనని, ఒక విద్యాలయం మంచి క్రమశిక్షణతో అభివృద్ధిపథంలో సాగుతుందంటే అది వ్యాయమ అధ్యాపకుల గొప్పతనమేనని అన్నారు. క్రమశిక్షణ లేని శిక్షణ సాధ్యపడదని, విద్యార్థులకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వారి శక్తిసామర్ధ్యాలను, నైపుణ్యాలను కనిపెట్టేది మీరేనని అన్నారు. మంచి ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన పౌరులు తయారుకావాలన్నా, ప్రపంచస్థాయి క్రీడాకారులుగా విజయం సాధించాలన్నాదానివెనుక వ్యాయమ అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం అన్నారు. ముఖ్యఅతిథి దేవానందరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యార్థి ఎదుగుదలకు తోడ్పడే నమ్మకమైన నేస్తం వ్యాయమ అధ్యాపకుడేనని, వ్యాయమ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, మంచి ప్రణాళికా బద్దమైన క్రమశిక్షణ గల వ్యక్తి తమ సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉండడం అదృష్టం అన్నారు.  అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి 400 మంది వ్యాయమ అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.  . 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us