Updated 15th April 2017 Saturday 8:30 PM
పెద్దాపురం: పెద్దాపురం ఎస్ ఐ గా ఏ. కృష్ణభవాన్ శనివారం భాద్యతలు స్వీకరించారు. ఆయన కాకినాడ విఆర్ నుంచి బదిలీ పై ఇక్కడకి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన వై.సతీష్ కాకినాడ విఆర్ కు బదిలీ పై వెళ్లారు. ఈ మేరకు కృష్ణ భగవాన్ భాద్యతలు స్వీకరించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అందరి సహాయ సహకారాలతో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భం గా డిఎస్పీ ఎస్. రాజశేఖరరావు, సి ఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ను మర్యాద పూర్వకం గా కలుసుకున్నారు.