నెమలి పింఛం ఇంట్లో ఉంటే శుభం

Updated: April 5, 2017 , 9.00 am 
నెమలిని రక్షణ, భద్రతకు చిహ్నంగా పేర్కొంటారు. అతీంద్రయ శక్తుల నుంచి రక్షణ కల్పించడంలో మయూరం సహాయపడుతుంది. అంతేకాదు నెమలి పింఛం వల్ల ఇంట్లోని ప్రతికూలత శక్తుల నుంచి రక్షణ ఉంటుందని పురాతన రచనల్లో పేర్కొన్నారు. ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా నెమలి పింఛాన్ని గౌరవిస్తారు.దేవతలకు అధిపతి ఇంద్రుడు నెమలి సింహాసంపైనే ఆశీనుడై ఉంటాడు. కృష్ణ‌ుడు తన కీరిటంలోనూ నెమలి పింఛాన్ని ధరించాడు.దీపావళి రోజున నెమలి పింఛం మాదిరిగా తయారుచేసిన కాగడాలను ఉపయోగిస్తారు. నెమలి పింఛాన్ని ఎంతో పవిత్రమైనదిగానూ, రక్షించేదిగానూ ఆసియా వ్యాప్తంగా భావిస్తారు. అయితే 20 శతాబ్దం తొలినాళ్లలో నెమలి పింఛం ఇంట్లో ఉంటే అరిష్టమని పశ్చిమ దేశాల్లో భావించేవారు. అయితే వివిధ మత గ్రంథాలు మాత్రం నెమలి ఫించం అదృష్టం, శ్రేయస్సుకు సంకేతమని పేర్కొన్నాయి. గ్రీకు  పురాణాలు ప్రకారం నెమలికి హెరాతో సంబంధం ఉంది. గ్రీకు దేవత హేరా వంద కళ్లున్న ఆర్గస్‌ నుంచి నెమలిని రూపొందించింది. కాబట్టి నెమలి పింఛం స్వర్గానికి ఖజానా, నక్షత్రాలకు ప్రతీకలుగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం నెమలి లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఈ దేవత అదృష్టం, కరుణ, దయ, సహనాన్న సూచిస్తుంది. అందుకే ఈ లక్షణాలన్నీ పొందడానికి నెమలి పింఛాన్ని ఉపయోగిస్తారు. ఆసియా ఆధ్యాత్మికతలో కరుణ, ప్రేమ, దయ సౌహార్ద్రానికి ప్రతీక అయిన క్వాన్ ఇన్‌‌తో నెమలికి సంబంధం ఉందని నమ్ముతారు. బౌద్ధమతం ప్రకారం నెమలి పింఛం నిష్కపటానికి ప్రతీక. పురి విప్పినప్పుడు ఇవన్నీ తోక వరకు వ్యాపించి ఉంటాయి. క్రైస్తవంలోని ఆధ్యాత్మిక బోధనల్లో పునరుజ్జీవం, మరణం లేకపోవడం, పునరుద్ధరణ సంబంధానికి నెమలిని చిహ్నంగా సూచిస్తారు. ముస్లిం మతం ప్రకారం అద్భుతమైన అందం నెమలి సొంతం. మసీదులు, రాజ ఉద్యావనాలలో ఒక చిహ్నంగా నెమలిని ఉపయోగిస్తారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us