UPDATED 3rd JULY 2017 MONDAY 5:00 AM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగులోనే కాదు మలయాళంలోను మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతి సినిమా మాలీవుడ్ లో విడుదలై మంచి ఘన విజయం సాధిస్తుంటుంది. తాజాగా దువ్వాడ జగన్నాథమ్ చిత్రాన్ని కూడా మలయాళంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. తెలుగులో 100 కోట్ల వసూళ్ళు రాబట్టిన డీజే మలయాళంలోను మంచి వసూళ్ళను రాబడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. జూలై 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో డీజే చిత్రానికి డివైడ్ టాక్ రాగా, మాలీవుడ్ లో పాజిటివ్ టాక్ అందుకుంటుందని యూనిట్ భావిస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.