MLA Roja: శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్‌గా చక్రపాణి రెడ్డిని నియమించడంతో ఎమ్మెల్యే రోజా కినుక

UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 06:55 PM

శ్రీశైలం (రెడ్ బీ న్యూస్): తన వైరి వర్గానికి కీలక పదవులు రావడంతో నగరి ఎమ్మెల్యే రోజా అలకబూనారు. శ్రీశైలం ఆలయ పాలకమండలిని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి నియమించింది. చక్రపాణిరెడ్డి ఛైర్మన్‌గా 15 మంది సభ్యులతో పాలకమండలి ఖరారు చేసింది.

అయితే కీలకమైన ఛైర్మన్‌ పదవిని రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ఇవ్వడంతో రోజా మనస్తాపానికి గురయ్యారు. చక్రపాణిరెడ్డితో కొంతకాలంగా రోజాకు విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఈ విషయాన్ని రోజా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది.

ఆలయ ఛైర్మన్‌ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే చక్రపాణిరెడ్డికే ఆలయ ఛైర్మన్‌ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురయ్యారు. తన మాట లెక్క చేయకుండా చక్రపాణి రెడ్డికి పదవి ఇవ్వడంతో ఆమె అలకబూనారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us