గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం

UPDATED 5th JULY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని గాంధీబొమ్మ సెంటర్లో సుమారు రెండు లక్షలు విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని జి. శివప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు సూచనల మేరకు పెద్దాపురం, తుని సిఐలు వై.ఆర్.కె. శ్రీనివాస్, విప్పెర్ల శ్రీనివాస్, సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాస్ నాయక్ లు గాంధీబొమ్మ సెంటర్లో నిఘా ఏర్పాటు చేయడంతో గుట్కా రవాణాను అడ్డుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.          

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us