పెద్దాపురంలో చోరీ

UPDATED 7th SEPTEMBER 2017 THURSDAY 2:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఈ చోరిలో సుమారు నాలుగు కాసులు బంగారు గొలుసుతో పాటు నగదు అపహరణకు గురయ్యింది. పట్టణ సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక నాగేశ్వరరావు వీధిలో నివాసం ఉంటున్న శ్రీకాకుళపు సాయికృష్ణ ప్రియ ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి మెడలో ఉన్న నాలుగు కాసుల బంగారు గొలుసు, రూ.ఐదు వేలు నగదును దోచుకెళ్ళాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల నుంచి ప్రజలు రావడంతో దొంగ పరారయ్యాడు. ఈ విషయం పై ఎస్ ఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us