Sreeleela : త్రివిక్రమ్, మహేష్ సినిమాలో ‘పెళ్లి సందD’ హీరోయిన్??

Sreeleela : ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రోష‌న్ కుమార్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన సినిమా ‘పెళ్లి సందD’. గ‌త ఏడాది ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. కానీ ఈ సినిమాతో హీరోయిన్ శ్రీలీలకి తెలుగులో మంచి పేరు వచ్చింది. శ్రీలీల గతంలో కన్నడలో కూడా సినిమాలు చేసింది. ‘పెళ్లి సందD’ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది.

దీంతో ‘పెళ్లి సందD’ సినిమా తర్వాత శ్రీలీలకి వరుస సినిమా వకాశాలు వచ్చాయి. ఇప్పటికే శ్రీలీల ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో ‘ధ‌మాకా’లో న‌టిస్తుంది. దీంతో పాటుగా న‌వీన్ పొలిశెట్టి ‘అన‌గ‌న‌గా ఒక‌రాజు’ సినిమాలో కూడా న‌టిస్తుంది. ఇవి కాక మరో సినిమా కూడా చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా శ్రీలీలకి మరో భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

తాజా స‌మాచారం ప్ర‌కారం త్రివిక్ర‌మ్ – మ‌హేష్‌బాబు కాంబోలో వ‌స్తున్న మూడో చిత్రం #SSMB28లో శ్రీలీలకి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఇప్పటికే పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. త్రివిక్రమ్ చాలా సినిమాలలో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. దీంతో తాజాగా త్రివిక్రమ్ మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us