తెలంగాణ ప్రభుత్వంపై బన్నీ ప్రశంసలు

UPDATED 20th DECEMBER 2017 WEDNESDAY 6:30 PM

ప్రపంచ తెలుగు మహాసభలని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా కొనియాడారు. తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటి చెప్పేందుకు ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం అత్యద్భుతం అని బన్నీ ట్వీట్ చేశాడు. తెలుగు మహాసభలు విజయవంతం కావడంతో తనకి ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అన్నాడు. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలకి రాష్ట్రం నుండే కాక  దేశ, విదేశాల నుండి భాషాభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం రోజు ఇండస్ట్రీకి సంబంధించి స్టార్ హీరోలతో పాటు కవులు, రచయితలు, భాషాభిమానులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక  మహాసభల నిర్వహణపై ఆనందాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితోపాటు తెలుగు భాష అభివృద్ధికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు చేస్తున్న కృషిని సినీ ప్రముఖులు మనస్ఫూర్తిగా ప్రశంసించిన సంగతి తెలిసిందే.
 
 
 
 
 
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us